»Green Field Highway Bridge Collapse In Khammam Distric
Khammam: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. కుప్ప కూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి
ఖమ్మం నుంచి అశ్వారావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన నిర్మాణంలోని వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో బ్రిడ్జి నిర్మాణంలో నిమగ్నమై ఉన్న ముగ్గురు కార్మికులు వంతెనపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
Khammam: ఖమ్మం నుంచి అశ్వారావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన నిర్మాణంలోని వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో బ్రిడ్జి నిర్మాణంలో నిమగ్నమై ఉన్న ముగ్గురు కార్మికులు వంతెనపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో ఖమ్మం నుంచి హైవే నిర్మాణం కొనసాగుతుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. కాగా, ఖమ్మం నుంచి వైరా సత్తుపల్లి అశ్వారావుపేట వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కొనసాగుతుంది. అయితే వైరా వద్ద వంతెన నిర్మాణం చేపట్టారు. వైరా నుంచి మధిర వెళ్లే ప్రధాన రహదారిపై వైరా నుంచి తల్లాడ వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. ఈ వంతెన నిర్మాణం జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వంతెన ఎందుకు కూలిపోయిందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఖమ్మం జిల్లా వైరాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే బ్రిడ్జి.. ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు. pic.twitter.com/q8x7VlpL7N