తూ.గో: నిడదవోలు మండలం కంసాలిపాలెం ఎర్రకాలువ ముప్పు ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ బుధవారం పర్యవేక్షించారు. ఎర్ర కాలువ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను,రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఎర్ర కాలువ ఏటిగట్టు కోత ప్రదేశాలను గుర్తించి ఇసుక బస్తాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.