VZM: కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో తుఫాన్ కారణంగా ఇళ్ళలోకి భారీ నీరు చేరింది. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వర్షాలు కురిసినప్పుడల్లా వర్షం నీరు ఇళ్ళలోకి చేరిపోతుందని వాపోతున్నారు. బుధవారం సచివాలయ కార్యదర్శి స్పందించి జేసీబీ సహాయంతో కాలువలో పేరుకుపోయిన పూడికలను తీసివేశారు. శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.