WGL: మొంథా తుఫాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇవాళ మంత్రి మాట్లాడుతూ.. శిథిలావస్థ ఇళ్లలో ఉండకూడదని, చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద ఆగకూడదని సూచించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని హెచ్చరించారు.