SKLM: పొలంలో అదనంగా ఉన్న నీటిని బయటికి విడిచి పెట్టాలని ఏవో సూర్య కుమారి తెలిపారు. బుధవారం పొలాలను పరిశీలించిన ఆమె రైతులకు తగు సూచనలు అందజేశారు. తెగులు వచ్చే అవకాశముంది కాబట్టి పంటను గమనించుకొని ప్రొపికొన జోల్ 200 మిల్లీ లీటర్లు లేదా హేగ్జాకోనాజోలు 400 మిల్లి లీటర్లు మరియు ప్లాంటా మైసిన్ 100 గ్రాములు కలిపి తెగులు రాక ముందే వినియోగించాలన్నారు.