PLD: మొంథా తుపాను ప్రభావంతో వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రభావిత గ్రామాల ప్రజలను శిరిగిరిపాడు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సురక్షితంగా తరలించారు. అక్కడ వారికి ఆహారం, తాగునీరు, మందులు అందజేశారు.