GNTR: గుంటూరులో ముందస్తు చర్యల కారణంగా వర్షపు నీరు నిలవలేదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం తెలిపారు. సిబ్బంది నేటి సాయంత్రం వరకు అలర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు. నేల కూలిన చెట్లపై వచ్చిన 68 ఫిర్యాదుల్లో 45 చెట్లను ఇప్పటికే తొలగించారు. పడిపోయిన చెట్లు, స్తంభాలు కనిపిస్తే వెంటనే 0863-2345103 నంబర్‌కు తెలియజేయాలని కమిషనర్ ప్రజలను కోరారు.