GNTR: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తుపాను పరిస్థితిని బుధవారం ఎమ్మెల్యే మాధవి కార్యాలయం నుంచే సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాలలో సేవలపై ఆమె అధికారులతో మాట్లాడారు. కార్యాలయానికి అందుతున్న ఫిర్యాదులను స్వీకరించి, అధికారులు,కూటమి నాయకులతో కలిసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ నిలిచిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.