SKLM: తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు ఇచ్ఛాపురం మండలం డొంకూరు ప్రభుత్వ పాఠశాలను భారీగా వరదనీరు ముంచెత్తింది. పాఠశాల జలమయమై నీట మునిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు బుధవారం పాఠశాలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వరద నీరు పాఠశాలల నుంచి బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.