'ఫిదా' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని.. నాగ చైతన్యతో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేశారు క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్ కోసం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా కొత్త సినిమా షూటింగ్ మొదలైంది.
Shekhar Kammula: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే D51 అనే వర్కింగ్ టైటిల్‌తో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది ఈ ప్రాజెక్ట్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడు. ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా రిలీజ్ అవగా.. తెలుగులో నాగార్జున ‘నా సామిరంగ’ రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇదే జోష్‌లో ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు ఇద్దరు. తాజాగా శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.
హైదరాబాద్‌లో అయితే చిత్ర యూనిట్ సమక్షంలో ముహూర్త కార్యక్రమాలతో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్ గడ్డం లుక్‌లో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో.. ఈ సినిమా యాక్షన్ మూవీ జానర్లో తెరకెక్కే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటి వరకు క్లాస్ సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల కూడా ఇప్పుడు మాస్ బాట పట్టినట్టే ఉది. అయితే.. ఈ సినిమాలో నాగార్జున కూడా జాయిన్ అవడంతో వర్కింగ్ టైటిల్‌గా #DNS అని పెట్టారు. మరి ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.