Prisoner Died: స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషీయల్ రిమాండ్‌లో ఉన్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జైలులో తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఖైదీ డెంగ్యూ జ్వరం బారినపడి చనిపోయాడు. ఇప్పుడు మరో ఖైదీ కూడా మృతిచెందాడు (Prisoner Died). దీంతో జైలులో ఖైదీల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మూరమండ గ్రామానికి చెందిన జోబాబు.. హత్య కేసులో జీవిత ఖైదు పడింది. 2002 అక్టోబర్ 23వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. 2008లో అతనిని ఓపెన్ జైలుకి షిప్ట్ చేశారు. జైళ్ల శాఖ పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాడు. అతనికి అనారోగ్య సమస్యలు వచ్చాయి. గత నెల 28వ తేదీన హైబీపీ వచ్చి పడిపోయాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరీక్షించన పలు వ్యాధులు బయటపడ్డాయి. హెచ్టీఎన్, న్యూరాలజీ సమస్య ఉన్నట్టు గుర్తించారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో అతనికి చికిత్స చేయించారు. అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఇక్కడ చికిత్స తీసుకుంటూ నిన్న చనిపోయాడు. జోబాబుకు పక్షవాతం వచ్చిందని.. శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల గుండెపోటు వచ్చి చనిపోయాడని వైద్యులు తెలిపారు. చంద్రబాబు ఉంటున్న జైలులో వరసగా ఖైదీలు చనిపోతున్నారు. అనారోగ్య సమస్యల వల్ల మృతిచెందున్నారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జైలు గదిలో దోమలు ఉన్నాయని, పరిశుభ్రంగా లేదని చెబుతున్నారు.