KMR: కొత్త ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పట్టణంలోని అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు, టిఫిన్ సెంటర్లు, టీ పాయింట్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలు,ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేశారు.