TG: జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ, కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఉదయం అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు రూ.28 కోట్ల పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీల్ కుమార్ పోటీ చేసిన విషయం తెలిసిందే.