W.G: జాతీయ రహదారి భద్రత దినోత్సవం సందర్భంగా బుధవారం ఆకివీడులో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకపోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, లైసెన్స్ లేని వాహనదారులపై 24 కేసులు నమోదు చేసి రూ. 68,610 జరిమానా విధించారు. తనిఖీల్లో అధికారులు ప్రసాద్, సత్యనారాయణ, రవికుమార్, నరేంద్ర పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఈ సందర్భంగా వారు కోరారు.