SRCL: అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీహరి ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినిపై దురుసుగా ప్రవర్తించగా.. ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో విచారణ జరిపిన అధికారులు ఎఫ్ఆర్వో శ్రీహరి ప్రసాద్‌ను బుధవారం సస్పెండ్ చేశారు.