SDPT: కొండపాక మండలం సార్లవాడకు చెందిన ఏలూరి రాములమ్మ హత్య కేసు మిస్టరీ వీడింది. పోలీసుల వివరాలు.. రాములమ్మ (58) భర్త చనిపోగా హోటల్ నడుపుతూ ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేసింది. కూలీ పనిచేస్తున్న చిన్న కుమార్తె భర్త జీవన్ రెడ్డి అత్త ఆస్తిపై కన్నేశాడు. ప్లాన్ ప్రకారం ఈ నెల 6న ఇంట్లో మెడకు టవల్ బిగించి హత్య చేశారు. ఈ కేసులో అల్లుడితోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.