విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 600కు పైగా పరుగులు సాధించాడు. అయినప్పటికీ, అతడికి భారత జట్టులో చోటు దక్కడం లేదు. దీనిపై పడిక్కల్ స్పందిస్తూ.. జట్టులో చోటు దక్కకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. అయితే, ప్రస్తుతం టీమిండియాలో చోటు సంపాదించడం అంత సులభం కాదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించాడు.