»Revanth Reddy The Whole World Should Stand By The Farmers
Revanth Reddy: రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాలి
రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన చిరకాల కోరికని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని రేవంత్రెడ్డి తెలిపారు.
Revanth Reddy: రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన చిరకాల కోరికని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని రేవంత్రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో భాగంగా ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు.
భారతదేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా మారాయి. బ్యాంకు రుణాలు రాక, ఆధునికి సాంకేతిక పద్ధతులు అందుబాటులో లేకపోవడంతో రైతులు సరైన లాభాలు పొందలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలు అర్థం చేసుకోగలను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు ప్రభుత్వం. అన్నదాతలకు నేరుగా పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు.