»Anchor Varshini Went To Pakistan India Match At Ahmedabad Narendra Modi Stadium Being Trolled On Social Media
india vs pakistan: అహ్మదాబాద్లో అడుగుపెట్టిన యాంకర్ వర్షిణి..వార్నింగ్ ఇస్తున్న నెటిజన్లు
నేడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిరేపే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. దానిని ఆటలా కాకుండా ఒక యుద్ధంలా భావిస్తారు భారతీయులు. అలాంటి ఆట జరిగే ప్లేస్కు ఐరన్ లెగ్ వర్షిణి వెళ్లిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎందుకు అలా చేస్తున్నారో ఇక్కడ చుద్దాం.
Anchor Varshini went to Pakistan India match at Ahmedabad Narendra Modi Stadium. Being trolled on social media.
India vs Pakistan: దేశమంతా ఐసీసీ వన్డే వరల్డ్ కప్(World Cup 2023) ఫీవర్ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు ఉత్కంఠతో కూడిన భారత్, పాకిస్తాన్(India vs Pak) మ్యాచ్ జరుగుతుంది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్రమోడీ స్టేడియం(Narendra Modi)లో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..పాకిస్తాన్ జట్టును కట్టడి చేసేలా విజృంభిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ వర్షిణి(Anchor Varshini) గురించి ట్రోల్ అవుతుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోన్న అహ్మదాబాద్ స్టేడియానికి యాంకర్ వర్షిణి వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆమె ఫోటోను చూసిన నెటిజన్లు ఆమెకు వార్నింగ్ ఇస్తున్నారు.
గతంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు కూడా వర్షిణిని మీమర్స్ తెగ ట్రోల్ చేశారు. హైదరాబాద్లో జరిగిన సన్రైజర్స్ మ్యాచ్లకు వర్షిణి గతంలో వెళ్లింది. అప్పుడు ఆమె వెళ్లిన ప్రతిసారి సన్రైజర్స్ ఓడిపోయింది. ఇక అప్పటి నుంచి వర్షిణిది ఐరన్ లెగ్ అని క్రికెట్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి అహ్మాదాబాద్ వెళ్లిన వర్షిణి గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. భారత్ ఓడిపోతే నీకు ఉంటదని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం భారత్ జట్టు దీటుగా బౌలింగ్ చేస్తుంది. అయితే ఇలాంటి నమ్మకాలను పక్కన పెట్టి మ్యాచ్ను చూడాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.