IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌కు వరుణ గండం.. ఐఎండీ హెచ్చరిక
రేపు జరగబోయే భారత్, పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ ప్రాంతంలో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది.
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup-2023) టోర్నీలో అందరూ ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. అహ్మదాబాద్ వేదికగా టీమిండియా (TeamIndia), పాకిస్తాన్ (Pakisthan) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాక్ జట్టు అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేశాయి. అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో లక్ష మందికి పైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను చూడటానికి సిద్ధమయ్యారు. అయితే ఈ మ్యాచ్‌కు వేలాది మందితో పాటుగా వరుణుడు కూడా రానున్నాడు.
ఇప్పటికే ఈ మ్యాచ్‌ను చూసేందుకు వేలాది మంది రైళ్లు, విమానాల ద్వారా అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. శనివారం మ్యాచ్ హైఓల్టేజ్ మధ్య సాగనుంది. ఇటువంటి సమయంలో భారత వాతావరణ శాఖ (IMD) ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు వరుణుడు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అక్టోబర్ 14, 15వ తేదీల్లో అహ్మదాబాద్ సహా ఉత్తర గుజరాత్ జిల్లాల్లోని పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆసియా కప్‌లో కూడా భారత్, పాక్ (IND vs PAK Match) మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడ్డాడు. దీంతో ఆ మ్యాచ్ రద్దయ్యింది. ఆ తర్వాత గ్రూప్ 4 దశలో కూడా భారత్, పాక్ మ్యాచ్‌ను వర్షం ఆపుతుందని తెలిసి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారులు రూల్స్ మార్చాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ఏర్పాటు చేశారు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీ (ODI World Cup-2023) లో ఇప్పటి వరకూ భారత్, పాక్ జట్లు వరుసగా రెండు విజయాలను పొందారు. టీమిండియా ఆసీస్, ఆఫ్ఘన్ జట్లపై విజయం సాధించింది. ఇకపోతే పాకిస్తాన్ జట్టు శ్రీలంక, నెదర్లాండ్ జట్లపై విజయాలు పొందింది. రెండు జట్లు ఈసారి మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇటువంటి సమయంలో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడకూడదని క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఎంతగానో కోరుకుంటున్నారు.