»Crazy Offer From Anand Mahindra To Asian Games 2023 Winner Rambabu
Anand Mahindra: ఆసియా క్రీడల విజేత రాంబాబుకు..ఆనంద్ మహీంద్రా క్రేజీ ఆఫర్
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ఇటివల ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెల్చుకున్న రాంబాబుకు సాయం చేస్తానని వెల్లడించారు. అయితే ఆ రాంబాబు ఎవరనే విషయం ఇప్పుడు చుద్దాం.
Crazy offer from Anand Mahindra to Asian Games 2023 winner Rambabu
ఆసియా క్రీడల కాంస్య పతక విజేత రాంబాబు(Rambabu) తన జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలోనే వాటిని ఎదుర్కొని ఆసియా క్రీడల్లోకి వచ్చిన విధానం గురించి తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అతనికి ఒక ఆఫర్ ప్రకటించారు. కష్టాల్లో ఉన్న అతని కుటుంబానికి ఒక ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో అతని ఫోన్ నంబర్ ఎవరైనా పంపించండి అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అతని సంకల్పం, ధైర్యం వల్లనే రాంబాబు ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెల్చుకునే స్థాయికి చేరాడని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
Daily wage worker to Asian Games Medallist. Unstoppable courage & determination. Please give me his contact number @thebetterindia I’d like to support his family by giving them any tractor or pickup truck of ours they want. pic.twitter.com/ivbI9pzf5F
ఆసియన్ గేమ్స్‌లో 35 కి.మీ రేస్ వాకింగ్ ఈవెంట్లో రాం బాబు సాధించిన అద్భుతమైన విజయాలు అతనికి గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన రాంబాబూ ఒక రోజువారీ కూలీ కార్మికుడు. అతని కుటుంబానికి వచ్చే కొద్దిపాటి ఆదాయం కారణంగా అతని అవసరాలు తీరడం చాలా సవాలుగా మారేది. ఆ క్రమంలో అతను క్రీడా శిక్షణ కోసం రాంబాబూ వివిధ ఉద్యోగాలను చేస్తూ జీవితాన్ని కొనసాగించాడు. అతని క్రీడా శిక్షణకు నిధులు సమకూర్చడానికి అతను వెయిటర్‌గా కూడా పనిచేశాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో MGNREGA పథకం కింద 100 రోజుల పని కూడా చేశాడు. ఆ విధంగా అనేక పనులు చేస్తూ ఒలంపిక్స్ లో పతకం గెల్చుకునే స్థాయికి చేరుకున్నాడు. రాంబాబు అసాధారణ ప్రయాణం అతన్ని ఆసియా క్రీడల పోడియం వరకు తీసుకువెళ్లి గుర్తింపును పొందెలా చేసింది. ఆనంద్ మహీంద్రా దాతృత్వం అందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చెస్ ప్రాడిజీ ఆర్ ప్రజ్ఞానానంద తల్లిదండ్రులకు కూడా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు.