»Dont Mess With The Indian Army Anand Mahindras Republic Day Post Goes Viral
Anand Mahindra: మన సైనులతో పెట్టుకోవద్దు.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా మన సైనికులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజెప్పేలా జవాన్లు చేసిన స్టంట్స్‌పై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Don't mess with the Indian Army.. Anand Mahindra's Republic Day post goes viral
Anand Mahindra: గణతంత్ర దినోత్సవం(Republic Day) రోజు ప్రతి సంవత్సరం మన సైనికుల విన్యాసాలు అద్బుతంగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) స్పందించారు. మన భారత సైనికుల శక్తిని కొనియాడుతూ పోస్ట్ పెట్టారు. శత్రుదేశాలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చిరించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
‘‘ఇతర దేశాల సైన్యానికి నాదో సలహా. వీళ్లతో ఎప్పుడూ పెట్టుకోవద్దు’’ అని మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. మన సైన్యం చాలా శక్తివంతమైనది అని, ‘భారత్ దృఢంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా ఎమోజీలను జత చేశారు. ఈసారి జరిగిన గణతంత్ర వేడుకల పరేడ్‌లో మన సైనికుల అద్భుతమైన శక్తిని ప్రపంచం చూసింది. దేశీయంగా తయారుచేసిన ఆయుధాలు, నాగ్ క్షిపణులు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, పినాక మల్టిపుల్ రాకెట్ వ్యవస్థ, వెపన్ లొకేషన్ రాడార్ వ్యవస్థలు, బీఎంపీ-2 సాయుధ శకటాలను ప్రదర్శించారు. వీటితో పాటు తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన నారీమణులు చేసిన కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.