Anand Mahindra : టాలీవుడ్లో ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్‌పై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. కలలు కనడం ఆపొద్దంటూ ప్రోత్సహించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898ఏడీ. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో చిత్ర బృందం ‘బుజ్జి’ అనే కారును ఏడు కోట్లు ఖర్చు చేసి మరీ తయారు చేయించింది. దీంతో గతంలో సాయం కోరుతూ నాగ్ అశ్విన్(Nag Ashwin) పెట్టిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా స్పందించారు.
‘నిజానికి సరదా సంగతులన్నీ ఎక్స్‌లోనే కనిపిస్తాయి. దర్శకుడు నాగ్ అశ్విన్, ఆయన టీం గొప్పగా ఆలోచించడానికి ఏ మాత్రమూ భయపడరు. వారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సరికొత్త వాహనాలు తయారు చేయడంతో కల్కి మూవీ టీంకి చైన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీం ఎంతో సహకరించింది. బుజ్జి కారు రెండు మహీంద్రా ఈ మోటార్లతో నడుస్తుంది. జయమ్ ఆటోమోటివ్స్ కూడా ఈ కారును సిద్ధం చేయడంలో భాగస్వామి అయ్యింది’ అంటూ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)తెలిపారు.
ఇలా ఆనంద్ మహీంద్రా పెట్టిన ట్వీట్‌కు అశ్విన్ స్పందిస్తూ అసాథ్యం అనుకున్న కలను సుసాథ్యం చేశారంటూ థ్యాంక్స్ చెప్పారు. దీంతో ఆ రిప్లైకి ఆనంద్ మళ్లీ రిప్లై ఇచ్చారు. ‘కలలు కనడం ఆపొద్దు’ అంటూ రీ ట్వీట్ చేశారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి 2898ఏడీ సినిమాలో బుజ్జి(Bujji) అనే కారు కోసం మహీంద్రా, జయమ్ ఆటోమోటివ్స్ సంస్థలు కలిసి పని చేసిన విషయం తెలిసిందే.