Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 68 ఏళ్ల వయస్సులో కూడా కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న మెగాస్టార్ ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. హీరోయిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నడుచుకుంటూ వెళ్లి సూపర్ డూపర్ హిట్లు సొంతం చేసుకుంటున్నారు. ఎలాంటి కష్టం లేకుండా కొందరికి ఫలితం వస్తుంది. కానీ ప్రతి మనిషి విజయం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి.
ఎన్నిరోజులు ఇలా కష్టపడి డ్యాన్స్, ఫైట్లు చేయాలి. హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్ వేసుకుని నటించి.. వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకుని వచ్చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితి మనది కాదు. మనం కష్టపడాలి. నిజంగానే ఫైట్లు చేయాలి. ఒళ్లు హునం చేసుకోవాలి. లేకపోతే దర్శక, నిర్మాతలకు కానీ, సినిమా చూసే ప్రేక్షకులకు కానీ తృప్తి ఉండదు. నిజం చెప్పాలంటే తనకు తృప్తి ఉండదని చిరంజీవి కామెంట్స్ చేశారు. అందుకే ఎప్పుడు కష్టపడి పనిచేయాలి’ అన్న చిరంజీవి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.