రామ్ గోపాల్ వర్మ వ్యూహాం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. చంద్రబాబుని టార్గెట్ చేసి విలన్‌గా చూపించారు. ఆయన వ్యుహాంతోనే జగన్ అరెస్ట్, రాజకీయ అణచివేత జరిగిందని చూపించారు.
ఆ తర్వాత సోనియా గాంధీ రోల్ చేసే వ్యక్తి యాత్రను ఆపాలని చెబుతారు.. ఆ వెంటనే జగన్‌ను సీఎం చేసేది లేదని మరొకరు చంద్రబాబుతో అంటారు. దాంతో ఇప్పుడు మొదలయ్యేది మన వ్యుహాం అని బాబు స్పందిస్తారు. బాబు చెప్పిన అబద్దాలు ఎన్నికల తర్వాత తెలుసుకుంటారని అజ్మల్ అమీర్, భారతీ పాత్ర చేసే మానస రాధాకృష్ణన్‌తో చెబుతారు. ఆస్తుల కేసుకు సంబంధించి విచారణలో మీ స్టేట్ మెంట్ ఏంటని ఫైనల్‌గా చెప్పాలని విచారణ అధికారి కోరగా.. తన స్టేట్ మెంట్ మీకు కాదు.. మిమ్నల్ని పంపించిన వారిని అని అమీర్ స్పష్టంచేస్తారు.
సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఉందని.. అభివృద్ధి సంగతేంటని మానస, అమీర్‌తో అంటోంది. కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్లాలని చంద్రబాబు అంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ మీరు 40 ఏళ్ల కుర్రాడికి ఎందుకు వణుకతున్నారని టీడీపీ నేతలు అనే సీన్ ఒకటి ఉంది. ఇప్పటివరకు జగన్ అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ.. పాదయాత్రతో జగన్ అంటే ఏంటో తెలుస్తోందని మానస చెబుతోంది. ఆ తర్వాత రావాలి జగన్, కావాలి జగన్ సాంగ్ వేశారు. 2019 ఎన్నికల్లో పీకే ఇచ్చిన ఆ స్లోగన్‌తో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ట్రైలర్ చివరలో పవన్ కల్యాణ్ పాత్రధారి వస్తారు.. తాను సీఎం అయిన అవకున్న ఫర్లేదు కానీ.. జగన్ అవకూడదని అంటారు. 2 లక్షల పుస్తకాలు చదివిన ఆ మనిషికి ఆ ఆలోచన ఉండదా అని అమీర్‌తో మానస అంటుంది.. నేను ఒంటరిగా నిల్చుంటే గెలుస్తాను అంటావా అని పవన్ కల్యాణ్ పడుకుని ఒక డైలాగ్ చెబుతారు. 200 శాతం అని కంటిన్యూగా మరొకరు చెబుతారు. చివరగా గ్లాసుతోనేనా సావాసం అని ఒకరు అనగా.. ఎలక్షన్ అవనివ్వు.. ఆ కల్యాణ్‌కు ఎవరు శత్రువు, మిత్రువో గుర్తించే తెలివి లేదని బాబు అంటారు. గ్లాస్ పారవేసి అనడంతో అతనిని వాడుకొని వదిలేశాడని అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ చివరలో స్కిల్ స్కామ్‌లో దోచుకున్న డబ్బు ఎవరీ జేబుల్లోకి వెళ్లిందని అమీర్ అడగగా.. జగనా వాడు నా ముందు పిల్ల పిత్రే గాడు అని చంద్రబాబు పాత్రధారి డైలాగ్ చెప్పడంతో ట్రైలర్ ముగుస్తోంది.