»Odi World Cup 2023 Bangladesh Lost New Zealand Won
ODI World Cup-2023: బంగ్లాదేశ్ చిత్తు.. న్యూజిలాండ్ ఘన విజయం
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలను సాధిస్తోంది. చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం వల్ల పాయింట్ల పట్టికలో మళ్లీ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.
నేటి వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 రన్స్ చేసింది. కివీస్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో టాపార్డర్ విఫలం అయ్యింది. దీంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేయలేకపోయింది.
ఆ తర్వాత 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 2 వికెట్లను కోల్పోయి 42.5వ ఓవర్లోనే టార్గెట్ సాధించి విజయాన్ని పొందింది. గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైన విలియమ్ సన్ 78, డారిల్ మిచెల్ 89 పరుగులు చేసి జట్టుకు విజయాన్నిఅందించారు. మిగిలిన వారిలో డేవాన్ కాన్వే 45 రన్స్ చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, షకీబ్ అల్ హసన్ చెరో వికెట్ తీశారు.
Flicked down the ground for a maximum 💫
This Kane Williamson six is one of the moments that could be featured in your @0xFanCraze Crictos Collectible packs!