W.G: మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల డిప్యూటీ ఎంపీడీవో ముచ్చర్ల నాగేశ్వరరావు (చిన్నా) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. నరసాపురంలో ఓ మెడికల్ షాపు వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.