NLR: మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. సంతపేటలోని ఆయన నివాసానికి వెళ్లి బొకే ఇచ్చారు. ఆనం నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. కాగా ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా రవిచంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు.