Cricket To Return In Olympics After 128 Years Confirms IOC
Cricket To Return In Olympics: ఒలింపిక్స్ ( Olympics) మహా సంగ్రామంలో క్రికెట్ ఆటకు చోటు లభించింది. అయితే వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో మాత్రం కాదు.. ఆ తర్వాత అంటే 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగస్వామ్యం కానుంది. ఈ మేరకు ఒలింపిక్స్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని చాలా ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు మంచి క్రేజ్ ఏర్పడటం ఓ కారణమైంది.
ఐవోసి ఆమోదం తెలిపిన నిర్ణయాలకు ఒలింపిక్ ప్రోగ్రామ్ కమిషన్ సమీక్షించి ఓటింగ్ ద్వారా చేర్చాల్సి ఉంటుంది. అప్పుడు అధికారికంగా ఒలింపిక్స్‌లో చేరుతుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోపీ, ఆసియా కప్, వరల్డ్ కప్ ఉన్నాయి. నెక్ట్స్ లెవల్ ఒలింపిక్స్ కానుంది. ఒలింపిక్స్‌లో టీ 20 మ్యాచ్‌లు జరుగుతాయి. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌తోపాటు బేస్ బాల్, ప్లాగ్ ఫుట్ బాల్, లాక్రోసీ, స్వ్కాష్ క్రీడలకు చోటు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. 1900 ఒలింపిక్స్‌లో 18 ఆటలతో క్రికెట్ కూడా ఒకసారి మాత్రమే జరిగింది. సో.. దానిని లెక్కబడితే 128 ఏళ్ల తర్వాత క్రికెట్ ఒలింపిక్స్‌లోకి రానుంది. అదీ కూడా ఫుల్ టైమ్ గేమ్ జరగనుంది.
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ద్వారా భారతదేశంలో ప్రసార హక్కుల ద్వారా భారీగా సొమ్ము రాబట్టాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒలింపిక్స్ ప్రసార హక్కుల వేలం ద్వారా రూ.158 కోట్ల మాత్రమే ఐవోసికి వస్తున్నాయి. అదే క్రికెట్‌ను చేరిస్తే ప్రసార హక్కుల విలువ భారీగా పెరిగిపోనుంది. దాదాపు రూ.15 వేల కోట్ల ప్రసార హక్కుల ద్వారా ఐవోసీకి వస్తాయని అంచనాలు ఉన్నాయి.