»Pakistan All Out For 191 Runs Icc Odi World Cup 2023
India vs Pakistan: పాకిస్తాన్ ఆలౌట్..ఇండియా టార్గెట్ ఎంతంటే!
ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో భారత బౌలర్లు విజృంభించారు. ఈ క్రమంలో ఇండియా జట్టు పాకిస్తాన్ టీంను 191 పరుగులకే ఆలౌట్ చేసింది.
Pakistan all out for 191 runs icc odi world cup 2023
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో నేడు అహ్మదాబాద్‌లో కీలక 12వ మ్యాచ్ ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఉత్కంఠతో కొనసాగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత ఇషాన్ కిషన్ స్థానంలో శుభమాన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చినట్లు ప్రకటించారు. ఆ క్రమంలో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టులో అబ్దుల్లా షఫీక్ ఇమామ్ ఉల్ హక్ వచ్చి రాగానే బౌండరీల వర్షం కురిపించారు. ఆ క్రమంలో మహ్మద్ సిరాజ్ పరుగులను కట్టడి చేసి ఎనిమిదో ఓవర్లో అబ్దుల్లా షఫీక్‌ను అవుట్ చేశారు.
ఆ నేపథ్యంలో విజృభించిన భారత బౌలర్లు 191 పరుగులకే పాకిస్తాన్ జట్టును ఆలౌట్ చేసి కట్టడి చేశారు. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ప్రతి ఒక్కరూ కూడా రెండు చొప్పున మొత్తం 10 వికెట్లు తీసి ఔరా అనిపించుకున్నారు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో ప్రధానంగా బాబర్ 50 రన్స్ చేయగా, మహ్మద్ రిజ్వాన్ 49, ఇమామ్-ఉల్-హక్ 36, అబ్దుల్లా షఫీక్ 20 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.