»South Africa Vs Afghanistan 42nd Match Win Prediction
SA vs AFG: దక్షిణాఫ్రికా, ఆప్గానిస్తాన్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 జోరుగా సాగుతోంది. ప్రతి జట్టు కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు సెమీస్ అవకాశాల కోసం దక్షిణాఫ్రికా టీంపై పోటీ పడుతున్న ఆప్గాన్ జట్టు గెలుస్తుందా? గెలిచి సెమీస్ కు అర్హత సాధించే అవకాశాలు(prediction) ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
South Africa vs Afghanistan 42nd Match Win Prediction
ICC వన్డే ప్రపంచ కప్ 2023 రసవత్తరంగా కొనసాగుతుంది. అయితే సెమీస్ అవకాశాల కోసం ఇంకా పలు జట్లు పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నేడు 42వ మ్యాచులో దక్షిణాఫ్రికా, ఆప్గానిస్తాన్ జట్లు అహ్మదాబాద్ వేదికగా పోటీ పడనున్నాయి. దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం తమ 8 మ్యాచ్‌లలో 6 గెలిచి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఒకవేళ ఈరోజు ఓడిపోయినా తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే 2వ స్థానాన్ని కోల్పోయి 3వ స్థానానికి నెట్టబడుతుంది.
ఇక గత రాత్రి న్యూజిలాండ్ శ్రీలంకను 5 వికెట్ల తేడాతో ఓడించి వారి నెట్ రన్ రేట్ (NRR)లో భారీ బూస్ట్‌ను పొందే వరకు ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌పై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్నట్టుండి భారత్‌పై సెమీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే కివీస్‌ను అధిగమించేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు 438 పరుగుల తేడాతో ఆఫ్రికన్ దిగ్గజాలను ఓడించాలి. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. అయితే ఈ జట్ల మధ్య గత మ్యాచుల్లో ఏం జరిగిందో ఇప్పుడు చుద్దాం.
దక్షిణాఫ్రికా, ఆప్గానిస్థాన్లు(South Africa vs Afghanistan) ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాయి. ఇది కార్డిఫ్‌లో జరిగిన ICC ప్రపంచ కప్ 2019 సందర్భంగా జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ 35 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. ప్రొటీస్ తరఫున ఇమ్రాన్ తాహిర్ 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ICC ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న క్వింటన్ డి కాక్ 72 బంతుల్లో 68 పరుగులు చేసి దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో సహాయపడ్డాడు.
ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం పీచ్ స్పిన్నర్లకు అనకూలంగా ఉంటుందని, ఎక్కువగా పరుగులు చేయలేరని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రధానంగా IPL ఆటలలో బ్యాటింగ్‌కు మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు ఈ వేదికపై 29 ODIలు ఆడారు. వాటిలో 15 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, 14 సార్లు మొదట ఫీల్డింగ్ చేసిన జట్లు గెలిచాయి. నవంబర్ 4న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ఇక్కడ తలపడ్డాయి. ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు గూగుల్ గెలుపు సంభావ్యత ప్రకారం ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆప్గాన్ జట్టును ఓడించే అవకాశం 76% ఉందని తెలిపింది. అయితే ఈ రెండు జట్లలో ఏ టీం గెలుస్తుందో మీ అభిప్రాయం కామెంట్(comments) రూపంలో తెలియజేయండి.