»Chandrababu Said That The People Of Andhra Pradesh Should Win And Jagan Should Lose
Chandrababu: ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి
కలలకు రెక్కలు కార్యక్రమంలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ ఓడిపోవాలి అన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అని, నేడు ప్రపంచం అంతా ఐటీ రంగంలో మన వాళ్లు ఉన్నారంటే కారణం టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే అని అన్నారు.
Chandrababu said that the people of Andhra Pradesh should win and Jagan should lose.
Chandrababu: మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్లు, ఇప్పుడు అవి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో కలలకు రెక్కలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీ(TDP) కూటమి అధికారంలోకి రాగానే మహాలక్ష్మీ కార్యక్రమాన్ని తీసుకొస్తామని, తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ. 15 వేలను అందిస్తామన్నారు. స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ వచ్చిందంటే దానికి కారణం ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 22 సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తే అందరూ నవ్వారు కానీ ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగువాల్లు ఐటీ రంగాల్లో రాణిస్తున్నారన్నారు.
ప్రధాని చెబుతున్న వికసిత్ భారత్@2047 జరిగి తీరుతుందని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే ఇప్పటికే చాలా పరిశ్రమలు వచ్చి ఉండేవి అనేవి అన్నారు. జగన్ పాలనలో యువత, రైతులు, వ్యాపారులు అందరూ నష్టపోయారు అన్నారు. కలలకు రెక్కలు అనేది చాలా గొప్ప కార్యక్రమం అని మహిళల శక్తిని గుర్తించి వారి ఎదుగుదలకు ఉపయోగపడే పథకం అని అన్నారు. చదువుకునే విద్యార్థినులకు రుణాలు ఇచ్చి ప్రొత్సహించే అద్భుతమైన పథకం అని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే జగన్ ఓడిపోయి తీరాలి అని పేర్కొన్నారు.