»Virat Kohli Anushka Sharma Baby Bump At Bengaluru Viral Video
Anushka sharma: బేబీ బంప్ వీడియో..గుడ్ న్యూస్ అంటూ నెటిజన్ల కామెంట్స్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ఈ వీడియోలో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఇది తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
virat kohli anushka sharma baby bump at bengaluru viral
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli), నటి అనుష్క శర్మ(anushka sharma) కపుల్ గత కొన్ని రోజులుగా వారి వ్యక్తిగత జీవితం గురింతి వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ జంట బెంగుళూరులో తాజాగా కనిపించారు. ఆ క్రమంలో అనుష్క బేబీ బంప్ గా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. వీడియోలో అనుష్క విరాట్‌తో కలిసి హోటల్ వెలుపల నడుస్తూ కనిపించింది. విరాట్ కూడా ఆమె చేయి పట్టుకుని కనిపించాడు. అనుష్క నల్లటి షార్ట్ ఫ్లేర్డ్ డ్రెస్ వేసుకుంది. అందులో ఆమె బేబీ బంప్ గా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు అవుననే కామెంట్స్ చేస్తున్నారు.
ఆ క్రమంలో అనుష్క గర్భవతిగా ఉందా అని ఓ నెటిజన్ కామెంట్(comments) చేయగా..జూనియర్ విరాట్ వస్తున్నాడు. అనుష్క ప్రెగ్నెంట్ అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఇది చూసిన విరాట్ ఫ్యాన్స్ ఈ వైరల్ వీడియోపై లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు అనుష్క, విరాట్లు కొన్ని రోజుల క్రితం ప్రసూతి క్లినిక్ వెలుపల కనిపించారు. అప్పుడు తమ చిత్రాలను లీక్ చేయవద్దని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో దీనిపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. విరాట్, అనుష్కల వివారం 2017లో జరిగింది. జనవరి 2021లో వీరికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు వామికా కోహ్లీ.