»Rohit Sharma 3 Sixes Away From 300 Sixes In Odi Will Become The First Indian To Reach This Milestone
Rohit Sharma: సరికొత్త రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో 301 సిక్స్‌లు
వన్డే క్రికెట్లో సిక్సర్ల ట్రిపుల్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో 301సిక్సర్లు బాదాడు. ఈ రోజు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఇప్పటికే 3 సిక్సర్లు కొట్టి.. ఈ సిక్సర్ల ట్రిపుల్ సెంచరీని పూర్తి చేస్తాడు. అతను ఈ మైలురాయిని చేరుకున్న మొదటి భారతీయుడు.
Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను క్రికెట్ సర్కిల్‌లలో ‘హిట్‌మ్యాన్’ శర్మ అని కూడా పిలుస్తారు. క్రికెట్ మైదానంలో క్లీన్ సిక్సర్లు కొట్టగల సామర్థ్యం అతడికి ఉంది. నేటి మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డే క్రికెట్లో సిక్సర్ల ట్రిపుల్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో 301సిక్సర్లు బాదాడు. ఈ రోజు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఇప్పటికే 3 సిక్సర్లు కొట్టి.. ఈ సిక్సర్ల ట్రిపుల్ సెంచరీని పూర్తి చేస్తాడు. అతను ఈ మైలురాయిని చేరుకున్న మొదటి భారతీయుడు. ప్రపంచంలోని మూడవ ఓవరాల్ బ్యాట్స్‌మెన్. రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఫీట్ ను పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ చేశారు.
వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు 351 కొట్టిన ఆటగాడిగా షాహిద్ అఫ్రిది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 398 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ తన కెరీర్లో ఆడిన 301 వన్డే మ్యాచ్‌లలో 331 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆడిన 254 మ్యాచ్‌లలో 301 సిక్సర్లు కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సిక్సర్ల ట్రిపుల్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. కానీ అతను ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీ చేయడం ద్వారా దానిని భర్తీ చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై 131 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో భారత కెప్టెన్ కీలక పాత్ర పోషించాడు. హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టడమే కాకుండా ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు.