• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

BREAKING: ఆస్ట్రేలియా ‘విశ్వరూపం’

పసికూన ఒమన్‌పై ఆస్ట్రేలియా తన ప్రతాపాన్ని చూపింది. తొలుత ఒమన్‌ను 104 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఈ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 9.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ఓపెనర్లలో మార్ష్ (64*) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, హెడ్ 32 పరుగులతో రాణించాడు. ఇప్పటికే సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. విజయంతో తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగించింది.

February 20, 2026 / 11:26 PM IST

T20 WC ఫైనల్ భారత్ vs ఇంగ్లండ్..?

T20 WC ఫైనల్ పోరు భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జోస్యం చెప్పాడు. సొంత గడ్డపై ఆడుతున్న భారత్ ఈ టోర్నీలోనే బలమైన జట్టుగా ఉందన్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా ఫైనల్ చేరుతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

February 20, 2026 / 08:33 PM IST

చెలరేగిన ఆసీస్ బౌలర్లు.. ఒమన్ ఆలౌట్

పసికూన ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగారు. దీంతో ఒమన్ జట్టు 16.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా.. బార్ట్‌లెట్, మాక్స్‌వెల్ తలో రెండు వికెట్లు తీశారు. ఒమన్ బ్యాటర్లలో వసీం అలీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

February 20, 2026 / 08:30 PM IST

విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్‌

టీమిండియా స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా SMలో వెల్లడించాడు. గత 15 నెలలుగా కోర్టులో ఈ న్యాయపోరాటం సాగిందని, చివరకు ఈ అధ్యాయం ముగిసిందని పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ సోదరుడైన రాహుల్, గత ఏడాది జరిగిన IPL 2026 వేలంలో CSK రూ. 5.2 కోట్లకు కొనుగోలు సంగతి తెలిసిందే.

February 20, 2026 / 08:26 PM IST

అభిషేక్‌పై బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు టీమిండియా బౌలింగ్ కోచ్ పూర్తి మద్దతు ప్రకటించాడు. అభిషేక్ ఫామ్‌పై జట్టులో ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. అతని సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అభిషేక్ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడని, త్వరలోనే అతను భారీ స్కోర్లతో ఫామ్‌లోకి వస్తాడని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

February 20, 2026 / 08:18 PM IST

సఫారీలపై టీమిండియాదే పైచేయి

T20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్లు మరోసారి కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు T20 WC చరిత్రలో ఈ రెండు జట్లు 7 సార్లు తలపడగా, భారత్ 5 సార్లు విజయం సాధించి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2024 ఫైనల్లో సఫారీలను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో 22న జరిగే మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తోంది.

February 20, 2026 / 08:00 PM IST

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనలిస్ట్‌లు వీరే..!

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరే జట్లేవో భారత్ మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని తెలిపారు. ప్రస్తుత ఆటగాళ్ల ఫామ్, టీమ్ బ్యాలెన్స్ ఆధారంగా ఈ నాలుగు జట్లు ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టీమిండియా ఈసారి కచ్చితంగా ఫైనల్ చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

February 20, 2026 / 07:36 PM IST

T20 WC: ఒమన్‌పై టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఒమన్: అమీర్ కలీమ్, జతీందర్ సింగ్(సి), కరణ్, మీర్జా, వసీం అలీ, నదీమ్, వినాయక్(w), రామానంది, ఒడెద్రా, షకీల్, షఫీక్AUS: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, గ్రీన్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (w), మాట్ రెన్షా, మాక్స్‌వెల్, స్టోయినిస్, బార్ట్‌లెట్, ఎల్లిస్, జంపా

February 20, 2026 / 06:40 PM IST

అభిషేక్, ఇషాన్ కంటే అతడే డేంజర్: గవాస్కర్

స్పిన్నర్లకు శివం దూబే సింహస్వప్నంగా మారాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బంతి ఎక్కడ పడినా, దానిని స్టాండ్స్‌లోకి పంపే సామర్థ్యం దూబేకు ఉందని కొనియాడాడు. దీనివల్ల అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలియక బౌలర్లు తలపట్టుకుంటున్నారని అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కంటే కూడా దూబే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని పేర్కొన్నాడు.

February 20, 2026 / 05:15 PM IST

మహేష్ బాబు అంటే ఇష్టం: టీమిండియా క్రికెటర్

టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దూబే మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. మహేష్ బాబు అత్యంత హ్యాండ్‌సమ్ హీరో అంటూ కొనియాడాడు. అలాగే, అల్లు అర్జున్ కూడా తనకు ఇష్టమని, ఆయన నటించిన ‘పుష్ప’ సినిమా బాగా నచ్చిందని పేర్కొన్నాడు.

February 20, 2026 / 05:00 PM IST

T20 WC చరిత్రలో ఇదే మొదటిసారి

2026 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ ముగిసే సమయానికే మూడు సెంచరీలు (నిస్సంక, యువరాజ్ సమ్రా, ఫర్హాన్) నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో మూడు సెంచరీలు నమోదు కావడం ఇదే మొదటిసారి. టోర్నీ సగం కూడా పూర్తికాకముందే మూడు సెంచరీలు నమోదు కావడంతో, ఈ మెగా టోర్నీ ముగిసేలోపు ఇంకెన్ని సెంచరీలు నమోదవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

February 20, 2026 / 04:46 PM IST

కోహ్లీ లాంటి ప్లేయర్ మాకు లేడు: కమిన్స్

విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా కోహ్లీకి ఉందని కొనియాడాడు. ఆసీస్ జట్టులో కోహ్లీ వంటి ఆటగాడు లేడని, అందుకే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడికి లోనై ఓడిపోయామని పేర్కొన్నాడు. విరాట్ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయని వ్యాఖ్యానించాడు.

February 20, 2026 / 04:22 PM IST

ఫైనల్‌ల్లో భారత్ VS బంగ్లాదేశ్

‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పాక్ 16.4 ఓవర్లలో కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.

February 20, 2026 / 03:37 PM IST

T20 WC: ఆసీస్‌కు పసికూన సవాల్

T20 WCలో ఈరోజు ఆస్ట్రేలియాతో ఒమన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడిలో ఉందని, ఆ జట్టును ఓడించడానికి తమకు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పసికూన ఒమన్, ఆస్ట్రేలియాను ఓడిస్తామనడం.. ఆ జట్టుకు సవాల్ విసిరినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

February 20, 2026 / 03:23 PM IST

టీమిండియా ప్రదర్శనపై అశ్విన్ అసంతృప్తి

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నట్లు ఆయన తెలిపాడు. ఇక బౌలింగ్‌లో చక్రవర్తి మరోసారి తన స్పిన్ మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడని చెప్పాడు. టీ20ల్లో షాట్లు ఆడటమే కాదు, బంతిని టైమ్ చేస్తూ గ్యాప్స్‌లోకి ఆడటం కూడా ముఖ్యమన్నాడు.

February 20, 2026 / 03:08 PM IST