వన్డే వరల్డ్ కప్ (World Cup) 2023 లో పెద్ద జట్లకు ఉహించని విధంగా షాక్‌లు తగులుతున్నాయి. పసికూన జట్టు అయిన అఫ్గాన్ .. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా (South Africa) వంటి జట్లను ఓడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ క్రమంలోనే నిన్న పాకిస్తాన్ (Pakistan), ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) జట్టు మరో సంచలన విజయం సాధించింది. మొన్న ఇంగ్లండ్ ను ఓడించడం ఆషామాషీగా జరిగింది కాదంటూ, ఇవాళ పాకిస్థాన్ పై గెలిచి శభాష్ అనిపించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది.
టాస్ గెలిచిన పాక్ మొదట 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగుల ఛేజింగ్ (Chasing) లో ఆఫ్ఘన్ టాపార్డర్ అదరగొట్టింది. ఓపెనర్లు రహ్మనుల్లా (Rahmanullah) గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ తొలి వికెట్ కు 130 పరుగులు జోడించి గట్టి పునాది వేయగా… రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది మిగతా పని పూర్తి చేశారు. రహ్మనుల్లా గుర్బాజ్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 65 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఇబ్రహీం (Ibrahim) జాద్రాన్ 113 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ అవుటైన తర్వాత రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (Shahidi) మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.