»Two Trains Collided 20 People Died And More Than 100 People Were Injured
Breaking: రెండు రైళ్లు ఢీ..20 మంది దుర్మరణం, 100 మందికి పైగా గాయాలు
బంగ్లాదేశ్ లోని ఢాకా వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందగా మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 100 మందికి పైగా గాయాలు అయ్యాయి. బంగ్లాదేశ్ లోని ఢాకా సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ రైలు ప్రమాదంలో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు..సోమవారం సాయంత్రం 4.15 గంటలకు ఈ రైలు ఘటన చోటుచేసుకుంది. కిశోర్గంజ్ నుంచి ఢాకాకు వెళ్తున్న రైలు వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొనడంతోనే ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొనడంతో వెంటనే రెండు భోగీలు చెల్లాచెదురయ్యాయి. రెండు రైళ్ల కింద కొందరు ప్రయాణికులు చిక్కుకుపోవడంతో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రైల్వే, అగ్నిమాపక సహాయక సిబ్బంది రంగంలోకి దిగి గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.