»100 Percent Skill Still Not Been Seen Shubman Gill
Shubman Gill: వందశాతం ఆటను ఇంకా చూడలేదు
తన నుంచి ఇప్పటి వరకు 90 శాతం ఆటను మాత్రమే చూశారని టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అంటున్నారు. ఐపీఎల్, వన్డే మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ సంచలనం.. వరల్డ్ కప్‌లో మాత్రం ఇప్పటివరకు భారీ ఇన్సింగ్స్ ఆడలేదు.
100 Percent Skill Still Not Been Seen: Shubman Gill
Shubman Gill: వన్డే వరల్డ్ కప్‌లో డ్యాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆశించినంత ప్రతిభ కనబరచడం లేదు. ఐపీఎల్లో దుమ్ము దులిపిన గిల్.. ఆ తర్వాత మాత్రం ఆ స్థాయిలో ఆడటం లేదు. తన బ్యాటింగ్ గురించి గిల్ స్పందిస్తూ.. భారీ ఇన్నింగ్స్ ఆడినా సరే 90 శాతం ప్రదర్శించినట్టు అవుతుందని అంటున్నారు. ఇప్పటికీ వంద శాతం ఆటను ఎవరూ చూడలేదని అంటున్నారు. మరింత ప్రొఫెషనల్‌గా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నారు.
లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 17 మ్యాచ్‌ల్లో 890 పరుగులు చేశాడు. వన్డే మ్యాచ్‌ల్లో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. 23 మ్యాచ్‌ల్లో 1325 రన్స్ చేసి.. వేగంగా వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. 19 ఇన్నింగ్స్‌ల్లో 1000 రన్స్ చేశాడు. 38 వన్డేల్లో 2012 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. కానీ వరల్డ్ కప్‌లో మాత్రం ఆశించిన ఫలితం ఇప్పటివరకు రాలేదు.
వరల్డ్ కప్ ఫస్ట్ రెండు మ్యాచ్‌లకు డెంగీ జ్వరం వల్ల దూరం అయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మాత్రం హాఫ్ సెంచరీ చేశాడు. ఇక కుదుట పడ్డాడు అని అనుకునేలోపు.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 రన్స్ చేశాడు. దీంతో నెక్ట్స్ మ్యాచ్‌లో అతని నుంచి మంచి ఇన్సింగ్స్‌ను అభిమానులు ఎదురు చూస్తున్నారు. తనలో ఉన్న పూర్తి ఆటను ఇంకా చూడలేదని.. చూడాల్సి ఉందని అంటున్నారు.