»Indian Team Is Strong Without Hardik Pandya Shamis Stay Is Key Wasim Akram
Wasim Akram: పాండ్య లేకపోయినా టీమ్ బలంగానే ఉంది.. షమీ ఉండడం కీలకం
వన్డే ప్రపంచకప్‌లో దూసుకుపోతున్న భారత్ జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీమ్‌లో లేకపోయినా జట్టు బలంగానే ఉందన్నారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమ్‌కు ఎంతో అవసరం అన్నారు.
Indian team is strong without Hardik Pandya. Shami's stay is key, Wasim Akram
Wasim Akram: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్ వరుస విజయాలను నమోదు చేస్తోంది. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది అని చెప్పవచ్చు. ఈ టైమ్‌లో గాయం కారణంగా హార్దిక్ పాండ్య(Hardik Pandya) టీమ్‌కు దూరం అయ్యారు. మరో రెండు మ్యాచ్‌ల వరకు పాండ్య దూరంగానే ఉంటారని తెలుస్తుంది. ఈ విషయం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అతడు జట్టులో లేకపోయినా టీమ్ఇండియా (Team India) బలంగానే ఉందని పాకిస్థాన్ మాజీ క్రికేటర్ వసీమ్ అక్రమ్ పేర్కొన్నారు. పాండ్య త్వరగా కోలుకొని వస్తే జట్టు మరింత బలంగా ఉంటుంది అన్నారు. అలాగే జట్టులోకి షమీ(Shami) తీసుకోవడం తెలివైన పని అని వ్యాఖ్యనించారు. కివీస్‌తో ఆటలో షమీ ప్రతిభను ప్రశంసించారు. తర్వాతి మ్యాచ్‌లలో అతడిని పక్కన పెట్టడం కష్టమే అని వెల్లడించారు.
హార్దిక్ పాండ్య (Hardik Pandya) లేకపోయినా ఇండియా టీమ్ అద్భుతంగానే ఉంది. అతడు త్వరగా కోలుకుని వస్తే మరింత బలంగా మారుతుందనడంలో సందేహం లేదు. కివీస్‌పై (IND vs NZ) అదరగొట్టిన షమీని ఇక పక్కన పెట్టడం చాలా కష్టం. హార్దిక్ వందశాతం రికవరీ అయిన తర్వాతే ఆడించేందుకు మేనేజ్మెంట్ చూస్తున్నట్లుంది. ఇక్కడ భారత బృందం చేసిన మరో అద్భుతమైన బాధ్యత ఏంటంటే ప్రతి ఆటగాడిని సంసిద్ధంగా ఉంచుకుంది. ఎప్పుడు జట్టులోకి వచ్చినా ఆడేందుకు ప్లేయర్లు రెడీగానే ఉన్నారు. దీనికి షమీనే ఊదాహరణ అని వసీమ్ పేర్కొన్నారు. వరల్డ్ కప్‌లో నాలుగు మ్యాచులకు దూరంగా ఉండి జట్టులోకి రాగానే ఏ ఆటగాడికైనా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అలాంటి సమయంలోనూ మొదటి బంతికే వికెట్ తీయడం అంటే మాములు విషయం కాదన్నారు. షమీ కొత్త బంతితో బౌలింగ్‌ను ఆరంభించే బౌలర్. కానీ, ఆ మ్యాచ్‌లో ఓపెనింగ్ స్పెల్ ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో మరొకరైతే నాకెందుకు కొత్త బంతి ఇవ్వలేదు అని బాధతో నిరుత్సాహాపడేవారు. కానీ షమీ తన అనుభవాన్ని ఉపయోగించి జట్టును గెలిపించేందుకు కృషి చేశాడు అని వసీమ్ అక్రమ్ తెలిపారు. అక్టోబర్ 29న ఆదివారం లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి.