వరల్డ్ కప్(World Cup)లో ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 23వ లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. సపారీలు (Safaris) నిర్దేశించిన 383 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 46.4 ఓవర్లకు 233 పరుగులకు అలౌట్ అయింది. లక్ష్యఛేదనలో మిడిలార్డర్ బ్యాట్స్ మన్ మహ్మదుల్లా (Mahmudullah) వీరోచిత శతకం వృథా అయింది.
బంగ్లా బ్యాటర్స్‌లో మహ్మదుల్లా (111) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్స్‌లో.. లిట్టన్ దాస్ (Litton Das) (22), మెహిదీ హసన్ మిరాజ్ (11), నసుమ్ అహ్మద్ (19), తాంజిద్ హసన్ (12) పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో సౌతాఫ్రికా 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లో.. గెరాల్డ్ కోయెట్జీ 3 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, లిజాడ్ విలియమ్స్, కగిసో రబడ (Rabada) చెరో 2 వికెట్లు పడగొట్టారు.