»Kremlin Gave Clarity To Russian President Putins Heart Attack
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గుండెపోటు..క్లారిటీ ఇచ్చిన క్రెమ్లిన్
రష్యా అధ్యక్షుడికి అర్ధరాత్రి వేళ హార్ట్ ఎటాక్ వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ ఫేక్ వార్తలని, వాటిన నమ్మొద్దంటూ రష్యా అధికారిక వర్గాలు వెల్లడించాయి. పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపాయి.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కూడా ఒకరు. తాజాగా ఆయనకు గుండెపోటు (Heart Attack) వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి. ఆయన ఆరోగ్యంపై తరచూ వార్తలు నెట్టింట సందడి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త వైరలయ్యింది. అర్ధరాత్రి వేళ పుతిన్‌కు గుండెపోటు రావడంతో వైద్య బృందాలు ఆయన ఇంటికి వచ్చాయనే దానిపై సర్వత్రా చర్చ నెలకొంది.
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి నివాస భవనం అయిన క్రెమ్లిన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లెమిన్ ఖండించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వస్తున్నాయని, గతంలో ఆయన క్యాన్సర్ బారిన పడ్డారని, రహస్యంగా చికిత్స తీసుకుంటున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. తాజాగా హార్ట్ ఎటాక్ వచ్చిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలేనని క్లెమిన్స్ పేర్కొంది.
71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ అక్టోబర్ 23వ తేదిన రోజంతా క్రెమ్లిన్ భవనంలో విధులను కొనసాగించారు. అలాగే బ్రెజిల్ అధ్యక్షుడితో కూడా ఆయన ఫోన్లో సంభాషించారు. రష్యాలోని ఓ ప్రాంతానికి చెందిన గవర్నర్‌ను కూడా ఆయన కలిశారు. ఈ తరుణంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, మంచం మీద నుంచి పడిపోయి రక్తపు మడుగులో ఉన్నాడంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలన్నింటినీ క్రెమ్లిన్ వర్గాలు ఖండించాయి.