సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో సౌతాఫ్రికా భారీ విజయాన్ని అందుకుంది.డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ (England) ఈసారి వరల్డ్ కప్లో దారుణంగా విఫలమవుతోంది. మొన్న అఫ్గానిస్తాన్ చేతిలో ఖంగుతిన్న ఇంగ్లిష్ జట్టు.. తాజాగా సౌతాఫ్రికా (South Africa) చేతిలో 229 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీ జట్టు నిర్దేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కేవలం 170 రన్స్కే ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా ఈ వరల్డ్ కప్లో అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. ముంబయి (Mumbai) వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు… క్లాసెన్ (109) సెంచరీ, హెండ్రిక్స్ (Hendrix) (85), వాన్ డర్ డుస్సెన్ (60), యన్ సెన్ (75 నాటౌట్) అర్ధసెంచరీలతో అతి భారీ స్కోరు నమోదు చేసింది.
నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగులు చేసింది. కెప్టెన్ మార్ క్రమ్ (Mar Crum) 42 పరుగులు సాధించాడు.ఇక, లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఆటతీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతబాగుంటుందేమో! జానీ బెయిర్ స్టో (10), డేవిడ్ మలాన్ (6), జో రూట్ (2), బెన్ స్టోక్స్ (5), కెప్టెన్ జోస్ బట్లర్ (Jose Butler) (15), హ్యారీ బ్రూక్ (17) వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఇంగ్లండ్ 22 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. చివర్లో మార్క్ ఉడ్ (43 నాటౌట్), గస్ ఆట్కిన్సన్ (35) పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. మార్క్ ఉడ్ 17 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. ఆట్కిన్సన్ 7 ఫోర్లు కొట్టాడు.