TG: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. జాతరలో మూడో రోజైన ఇవాళ మెస్రం వంశీయులు అత్యంత నిష్టతో ‘పెర్సాపెన్’ (పెద్ద దేవుడు), ‘బాన్’ పూజలను నిర్వహించారు. నాగోబాను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.