NZB: నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 21న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుసూదన్ రావు పేర్కొన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం 10.30 గంటలకు శివాజీనగర్‌లోని ఉపాధికల్పన కార్యాలయానికి రావాలని సూచించారు.