MBNR: ఢీల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు జిల్లాకు చెందిన ఒగ్గు కళాకారుడు కొల్లూరు శివరాజ్ ఎంపికయ్యారు. రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామానికి చెందిన శివరాజ్, జనవరి 26న రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో ఒగ్గుడోలు విన్యాసాలు చేయనున్నారు. జాతీయస్థాయిలో జిల్లా ప్రతిభను చాటుతుండటంపై వర్సిటీ విద్యార్థులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.