జగిత్యాల పట్టణ పద్మశాలి సంఘం కోశాధికారి కొక్కుల ప్రభాకర్-అరుణ, 28వ వార్డ్ సభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి సమక్షంలో సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బోగ రాజు కుమార్, కశేటి తిరుపతి, సాయి వరుణ్, చెన్న శ్రీనివాస్, చెన్న రఘు, రాజన్న, తదితరులు ఉన్నారు.