BHPL: భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలోని వాసవి కమ్యూనిటీ హాల్లో ఇవాళ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం (మాఘ శుద్ధ విదియ)ను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి అందంగా అలంకరించారు. మంగళహారతి సమర్పించి, పులిహోర ప్రసాదాన్ని నైవేద్యంగా అర్పించి భక్తులకు వితరణ చేశారు.