KNR: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా KNR-1 డిపోలో జిల్లా రవాణా శాఖ అధికారులతో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకై రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్లపై ఏర్పాటు చేసిన సంకేతాలను గమనిస్తూ వాటికి అనుగుణంగా డ్రైవింగ్ చేయాలన్నారు.