ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఇవాళ బీటీపీ కాలువ పనులను పరిశీలించనున్నారు. ఒంటిమిద్ది సమీపంలో జరుగుతున్న పనుల వేగాన్ని పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తారని అధికారులు తెలిపారు.