»Mohammed Shami Shamis Aggression In The World Cup Anil Kumbles Record Breaking
Mohammed Shami: వరల్డ్ కప్లో షమీ దూకుడు..అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్
వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ రికార్డును బ్రేక్ చేశాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మూడో స్థానానికి చేరాడు. వరల్డ్ కప్లల్లో ఇప్పటి వరకూ షమీ 32 వికెట్లు పడగొట్టి కుంబ్లే రికార్డును తిరగరాశాడు.
నేడు జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ (Icc Odi World Cup-2023)లో టీమిండియా (TeamIndia) బౌలర్ మహ్మద్ షమీ (Mahammed Shami) సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. టీమిండియా తరపున అత్యధిక వికెట్లు (Highest Wickets) తీసిన వారి జాబితాలో మూడో స్థానంలోకి చేరాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ (New Zealand)తో టీమిండియా పోటీపడుతోంది. ఈ పోరులో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది.
షమీ (Mahammed Shami) వేసిన తొలి బంతికే న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ అవుట్ అయ్యాడు. దీంతో షీమీ వరల్డ్ కప్లలో 32 వికెట్లు సాధించి రికార్డును నెలకొల్పాడు. గతంలో అనిల్ కుంబ్లే 31 వికెట్లు తీయగా ఆయన్ని వెనక్కి నెట్టి షమీ మూడో స్థానం నిలిచాడు.
వరల్డ్ కప్ (World Cups)లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో పేస్ దిగ్గజం జవగళ్ శ్రీనాథ్, లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ జహీర్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నారు. వారిద్దరూ వరల్డ్ కప్లలో 44 వికెట్లు తీయగా వారి తర్వాత ఇప్పుడు 32 వికెట్లతో మహ్మద్ షమీ నిలిచాడు. మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్లలో 28 వికెట్లు పడగొట్టి కుంబ్లే తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.